వాడవాడలా కొలువుధీరిన గణనాధులను దర్శించుకున్న ఎమ్మెల్యే తలసాని





సనత్ నగర్,సెప్టెంబర్20(రాజధాని న్యూస్) :
గణేష్ నవరాత్రులలో భాగంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ పరిధిలోని పలు గణేష్ మండపాలను సందర్శించి బొజ్జ గణపయ్యను దర్శించుకున్నారు.
బన్సీలాల్ పేట లో..
బన్సీలాల్ పేట డివిజన్ లోని ముస్లీం వక్ఫ్ బోర్డ్, జయ ప్రకాష్ నగర్, గండెమ్మ టెంపుల్, వడ్డెర బస్తీ, రామస్వామి కాంపౌండ్, బర్కల్ బస్తీ, గాంధీ నగర్, సీసీ నగర్, అరుణ్ జ్యోతి కాలనీ, భోలక్ పూర్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణనాధులను దర్శించుకుని పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే తలసాని.
సనత్ నగర్ డివిజన్ లో...
సనత్ నగర్ డివిజన్ లోని లోదా అపార్ట్మెంట్, సుందర్ నగర్ కమిటీ హాల్, ఉదయ్ నగర్ కాలనీ, 60 ఫీట్ రోడ్డు లో పీయూష్ గుప్తా ఆధ్వర్యంలో, తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణ నాధులను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అమీర్ పేట డివిజన్ లో...
ఆమీర్ పేట డివిజన్ లోని ఎస్సార్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణ నాధుడిని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కామెంట్లు